Nuvvu kaavaali anipisthundi


చెలి, ఈ బ్లాగ్ రాయాలని ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ నీపైన ఒక్క కవిత అయినా రాయాలనిపిస్తుంది.

నువ్వు నా జీవితంలో ఎంత ప్రాముఖ్యతో నీకంటే నాకే బాగా తెలుసు, ఏమో నీ గురించి ఎదో చెప్పాలనుకుంటున్న కానీ అది ఎలా చెప్పాలో అర్థంకాక సతమతమవుతున్న ...

ఏదో, నాకు వచ్చిన ఈ బ్లాగ్ రాయాలి అన్న పిచ్చి ఆలోచన కూడా అంతే, ఎదో చెప్పాలని ప్రయత్నిస్తున్న, కానీ ఏమి చెప్తానో....

నీ పెదాలపై కనిపించే నవ్వుకంటే నీ కళ్ళలోని నవ్వు నా మనసును కట్టి పడేసింది.
నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి అన్న స్వార్ధం నన్ను పిచ్చివాడిని చేస్తోంది, నువ్వు ఒక్క క్షణం దూరంగా ఉన్నా, ఎదో ఒక సంవత్సరంలా అనిపిస్తుంది.

నువ్వు నాలా ఆలోచిస్తావని తెలిసిన మరుక్షణమే నన్ను నేను మరచిపోయి నీ గురించే ఆలోచించటం మొదలుపెట్టా...

నువ్వు మౌనంగా ఉన్నవేళ నాకు గుండెలో ముళ్ళు గూర్చుకున్నట్టు ఉంటుంది....

ఏమిటో నువ్వు నా సొంతం అని తెలిసినా, నువ్వు పక్కనే ఉండాలని నా మనసు తహతహ లాడుతోంది.

మన మనసులు రెండు ఒక్కటయ్యాయి, మనం కలిసిపోయాము, కానీ ఎందుకు ఈ దూరం...
ఈ దూరాన్ని తట్టుకోలేకపోతున్నా...

వయసులో నీకన్నా పెద్దవాడినైనా, నేను నీ ముందు చిన్న పిల్లవాడిని...

ఏమిటో ఎదో చెప్పాలనుకున్న కానీ ఎదో చెప్తున్నా ...  కానీ నా మనసు ఒకటే చెప్తుంది... "నువ్వు కావాలని 😘"

తొందరగా వచ్చేయ్ చెలి ...



Comments

Popular posts from this blog

Marapuraani gnyapakam naa janmadinam